05-05-2025 01:30:07 AM
ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): టీజేఈ జేఏసీ కార్యాచరణకు ట్రెసా సంపూర్ణ మద్దతు ఉంటుందని ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే గౌతమ్‌కుమార్ తెలిపారు. తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్ల బదిలీలు జరగకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని విజయ్‌కుమార్ అనే తహసీల్దార్ ఎన్నికల బదిలీ జరగకపోవడం తీవ్ర ఆందోళనతో చనిపోయారని తెలిపారు.
నారాయణపేట జిల్లాలోని మల్లికార్జున్‌రావు కూడా వృద్ధాప్యంలో ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసుకోలేకపోతున్నానని తీవ్ర మనోవేదన వ్యక్తం చేశారని గౌతమ్‌కుమార్ చెప్పారు. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలతో పాటు పీఆర్సీ కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం 51 శాతం ఫిట్‌మెంట్‌ను వెంటనే అమలుచేయాలని కోరారు.