14 March, 2026 | 3:18 PM

సిరిసిల్ల నియోజకవర్గంలో గులాబీ ప్రభంజనం

15-12-2025 02:08 AM
  1. ప్రతిపక్షంలో లోను పట్టునిలుపుకున్న బీఆర్‌ఎస్ 

రెండవ విడత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 30 స్థానాలకు 20 సర్పంచ్ స్థానాలు గెల్చుకున్న బీఆర్‌ఎస్ 

సింగిల్ డిజిట్ కే పరిమితమైన అధికార కాంగ్రెస్ పార్టీ

10 గ్రామాల్లో మూడవ స్థానంలో హస్తం పార్టీ

బండి సంజయ్ ప్రకటనను పట్టించుకోని పల్లెజనం 

దరిదాపుల్లో కూడా లేని బీజేపీ

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 14 (విజయ క్రాంతి):సిరిసిల్ల నియోజక వర్గం లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తంగళ్లపల్లి మండలం 30 స్థానాలకు గాను 20 స్థానాల్లో గెలిచి గులాబీ ప్రభంజనం సృష్టించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పట్టు నిలుపుకుంది.

అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యింది. రెండేళ్ల పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం పై జనంలో ఉన్న వ్యతిరేకత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించింది. పదికి పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానంలో నిలవడం పార్టీ పై ప్రజల వ్యతిరేకతకు  నిదర్శనం. 

దరిదాపుల్లో కూడా లేని బీజేపీ 

కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిరిసిల్ల లో బీజేపీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే అధిక నిధులు ఇస్తామని బండి సంజయ్ చేసిన ప్రకటనను పల్లె ప్రజలు పట్టించుకోలేరు.16 గ్రామాల్లో బిజెపి కి అభ్యర్థులు కూడా పోటీకి దొరక్కపోవడం  గమనార్హం. 

మూడవ విడుత ఎన్నికలపై తంగళ్లపల్లి ప్రభావం 

మూడవ విడతలో  ఈ నెల 17 జరుగనున్న ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల సర్పంచ్ ఎన్నికలపై తంగళ్లపల్లి మండలం ఫలితాల ప్రభావం పడనుంది. బీఆర్‌ఎస్ శ్రేణులు వచ్చిన పలితాలతో జోష్ లో ఉన్నారు. నాలుగు మండలాల్లో కూడా బీఆర్‌ఎస్ మద్దతుదారులు మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశాలు మెరుగుపడ్డాయి.