15 April, 2026 | 11:04 AM

డ్రా పద్ధతిలో సర్పంచ్ ఎన్నిక

15-12-2025 02:08 AM

మెదక్ జిల్లా చీపురుదుబ్బ తండాలో కాంగ్రెస్ విజయం 

మెదక్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెదక్ మండలం చీపురు దుబ్బ తండా పంచాయతీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులిద్దరికి సమాన ఓట్లు రావడంతో డ్రా పద్ధతిలో సర్పంచ్ ఎన్నికయ్యారు. ఈ పంచాయతీలో మూడు తండాలను కలిపి 377 ఓట్లు ఉండగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కెతావత్ సునీతకు, బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థిని బీమిలికి 182 ఓట్లు చొప్పున వచ్చాయి. ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీశారు. అందులో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిని కెతావత్ సునీతకు విజయం వరించింది.