17 April, 2026 | 1:44 PM

ఒక్క ఓటు తేడాతో విజయం

15-12-2025 02:07 AM

ఆశాలపల్లి సర్పంచ్‌గా ఎన్నికైన మల్లమ్మ

వరంగల్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా ఆశాలపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నిక అంశం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది.  పదవి ఎస్సీ మహిళలకు కేటాయించారు. గ్రామంలో తొలుత ఒకే ఒక్క ఓటరు కొంగర మల్లమ్మ ఉన్నట్లు గుర్తించి, ఏకగ్రీవంగా ఎన్నికవుతుందని భావించారు. అయితే ఆ గ్రామానికి చెందిన యువకుడు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన యువతిని వివాహం చేసుకోవడంతో ఆమెను చివరి క్షణంలో పోటీకి దింపారు. దీంతో ఏకగ్రీ వం అవుతుందనుకున్న మల్ల మ్మ ఎన్నిక ఆశపై నీళ్లు చల్లినట్లు అయింది. పోటీ అనివార్యమై ఎట్టకేలకు ఆదివారం నిర్వహించిన రెండో దశ సర్పంచ్ ఎన్నికల్లో ఎట్టకేలకు మల్లమ్మ ఒకే ఒక్క ఓటు తేడాతో తన ప్రత్యర్థిపై విజయం సాధించడంతో ఉత్కంఠకు తెరపడింది.