శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్‌ల తీరు భేష్
08-12-2024 02:43 AM
ఆదిలాబాద్, డిసెంబర్ 7 (విజ యక్రాంతి): జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల తీరు భేష్ అని కలెక్టర్ రాజరిషా అన్నారు. రాష్ర్ట ప్రభుతం చేపట్టిన విజయో త్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధర్యంలో పోలీసు హెడ్ కార్టర్స్‌లో శనివారం వేడుకలను నిరహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గౌష్ అలం, రెండవ బెటాలి యన్ కమాండెంట్ నితికా పంత్, జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్‌లతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాగ్ స్కాడ్ బృందం విధులు, మాదక ద్రవ్యాలను గుర్తించడం, మందు పదార్థాలను గుర్తించడం లాంటి ప్రదరనలు ఇచ్చారు. వివిధ పోలీస్‌ల స్టాళ్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడి భోజారెడ్డి పాల్గొన్నారు.




