calender_icon.png 18 June, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్‌స్టేషన్ దేవాలయంగా ఉండాలి

18-06-2025 12:59:26 AM

జడ్చర్ల జూన్ 17 : జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న జడ్చర్ల పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ డి జానకి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను, కేసులను ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడుతూ క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని, నేషనల్ హైవే పై ట్రాఫిక్ ను నిరంతరం పరిశీలించాలని సూచించారు.

అతివేగంగా ప్రయాణించే వాహనాల వేగాన్ని తగ్గించేలా స్పీడ్ బ్రేకర్లు సీసీ, కెమెరాలు పక్కాగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేయాలని నిర్లక్ష్యం చేస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల సిఐ కమలాకర్ తదితరులు ఉన్నారు.