4 March, 2026 | 2:26 AM

శాంతినగర్ కాలనీలో హోలీ

04-03-2026 12:44 AM

చౌటుప్పల్, మార్చి 3: చౌటుప్పల్ పురపాలక కేంద్రంలో శాంతినగర్ కాలనీ లో  హోలీ వేడుకలను ఘనంగా  నిర్వహించారు. దీనిలో భాగంగా చిన్నారులు, పెద్దలు యువతీ యువకులు అందరూ కలిసి సహజ రంగులను చల్లుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బత్తుల శంకర్, తమ్మ కొండ రాజు, కొక్కు శ్రీను, ప్రధాన  కార్యదర్శి బొంగు పాండు,కోశాధికారి సురుగు రమేష్ గౌడ్, మంచి కంటి భాస్కర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

మోతెలో..

మోతె, మార్చి 3 : మండల పరిధిలోని గోపతాండ గ్రామంలోని యువకులు మంగళవారం  హోళీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామస్తులు కేరింతలు కొడుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, పాటలు పాడుతూ సంతోషంగా గడిపారు.

ఈ కార్యక్రమంలో మాలోతు అనసూర్య, మాలోతు యువరాజ్, మాలోతు అక్షిత, రాజేష్, కవిత, బన్ను, చిన్ను, ఐషు, ధనావత్ చినా, పూలమ్మ, మాలోతు బుజ్జి, మాలోతు రాజేష్, మాలోతు తేజక్షిత, ధనావత్ హాతిరాం, ధనావత్ లచ్చిరాం, ధనావత్ వేణు, తదితరులు పాల్గొన్నారు.