ప్రధాని రాకతో మారనున్న రాజకీయ ముఖచిత్రం
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్
ముషీరాబాద్, మే 9 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ బహిరంగ సభ తో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారనుందని రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. మే 10న తెలంగాణ రాష్ట్రలో సుమారు 8 వేల కోట్ల కేంద్ర నిధులతో రాష్ట్ర అభివృద్ధి పనులను ప్రారంభించడానికి విచ్చేస్తున్న ప్రధాని మోదీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఘనస్వాగతం పలికి బహిరంగ సభలో భారీ సంఖ్యలో పాల్గొనాలని గాంధీనగర్ డివిజన్ అశోక్‌నగర్‌లోని పలు విద్యా సంస్థలు, ఇన్స్టిట్యూట్‌లలో గ్రూప్స్‌కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు, వ్యాపారస్తులకు, స్థానిక ప్రజల కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ. డాక్టర్ కె. లక్ష్మణ్ బీజేపీ బహిరంగ సభ కరపత్రాలను అందచేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పశ్చిమ బంగాల్, అసోం, పుదుచ్చేరిలో రాష్ట్రాల ఎన్నికల్లో బీజే పీ విజయబేరి మ్రోగించిందన్నారు. ప్రధానిరాకతో రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రం మారనుందని లక్ష్మణ్ అన్నారు. కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి. భరత్‌గౌడ్, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్నసాయిచంద్, శ్రీకాంత్, దామోదర్, సత్తిరెడ్డి, శ్రీనివాస్, ఆనంద్‌రావు, నీరజ్, జ్ఞానేశ్వర్, శశికాంత్, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.






