యాదవ కార్పొరేషన్ హర్షణీయం
- సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌కు కృతజ్ఞతలు
- బడ్జెట్‌లో నిధులు కేటాయించి యాదవుల అభివృద్ధికి తోడ్పడాలి
- జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగయ్యయాదవ్
హైదరాబాద్, మే 9: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి యాదవ సహకార కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి హర్షం వ్యక్తంచేసింది. ఈ మేరకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడ మే కాకుండా, తొలిసారిగా చైర్మన్‌ను నియమించడం యాదవుల సామాజిక, ఆర్థిక ఎదు గుదలకు శుభసూచకమని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంటల జంగయ్య యాదవ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
యాదవుల చిరకాల ఆకాంక్షను గౌరవించి, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు జంగయ్య యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యాదవుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేయడం అభినందనీయమని కొనియాడారు. కేవలం కార్పొరేషన్ ఏర్పాటుతోనే సరిపెట్టకుండా.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించి యాదవ సమాజ అభివృద్ధికి తోడ్పాటునందించాలని విజ్ఞప్తిచేశారు. కోకాపేటలోని యాదవ సంఘ భవనాన్ని ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నూతన చైర్మన్లకు శుభాకాంక్షలు
యాదవ సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న ఎం రఘునాథ్ యాదవ్, వైస్‌చైర్మన్ జీ భాస్కర్ యాదవ్‌కు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి తరఫున జంగయ్యయాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. గొర్రెల, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌గా నియమితులైన సరిత తిరుపతయ్య, పశుసంవర్ధక అభివృద్ధి సహకార చైర్మన్‌గా ఎంపికైన చరణ్ కౌశిక్ యాదవ్‌కుసమితి అభినందనలు తెలిపింది. వీరంతా తమ పదవుల ద్వారా యాదవుల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని జాతీయ యాదవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిగె శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు ధనశ్రీ సింహాయాదవ్ ఆశాభావం వ్యక్తంచేశారు.






