09-12-2025 12:00:00 AM
కలెక్టర్ ప్రతీక్ జైన్
వికారాబాద్, డిసెంబర్- 8: జిల్లాలో మొదటి విడత పోలింగ్ జరిగే మండలాలో అధికారులు నిబంధనలు పక్కాగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని, ఏ చిన్న తప్పిదానికి ఆస్కారం కల్పించకూడదని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారo వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి 8 మండలాల ఏం పి డి ఓ లు, తహసిల్దార్ల తో జూమ్ సమావేశము నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలింగ్ సిబంది సమయ పాలనను పాటిస్తూ, సకాలంలో నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. మొదటి విడత పోలింగ్ ఈ నెల 11న జరుగనున్న దృష్ట్యా, 10వ తేదీ ఉదయం 8.00 గంటల సమయానికే దిస్త్రిబ్యుషన్ సెంటర్లకు చేరుకుని, మధ్యాహ్న భోజనం అనంతరం పోలింగ్ మెటీరియల్ ను తీసుకోని పోలింగ్ కేంద్రాలకు వెళ్ళాలని అన్నారు.
చెక్ లిస్టుకు అనుగుణంగా బ్యాలెట్ పత్రాలు, ఇతర సామాగ్రి ఉందా లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, అనంతరం డిస్త్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ స్టేషన్ కు చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను చక్కబెట్టుకోవాలని కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. సీటింగ్ అరేంజ్ మెంట్, సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ వంటి వాటిని నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఓటింగ్ విషయంలో గోప్యత నూటికి నూరు శాతం అమలు జరిగేలా చూడాలన్నారు.