18-05-2025 12:00:00 AM
కార్వాన్, మే 17: గుంతల రోడ్డును అధికారులు పూడ్చివేశారు. విజయక్రాంతి కథనా నికి స్పందించిన అధికారులు సత్వరమే చర్యలు తీసుకున్నారు. కార్వాన్ సర్కిల్ పరిధిలోని లంగర్ హౌస్ డివిజన్లోని ప్రశాంత్ నగర్ కాలనీలో కొన్ని రోజుల క్రితం కాంట్రాక్టరు డ్రైనేజీ పైపులైన్ తీసి ప్యాచ్ వర్క్ చేయకుండా అలాగే వదిలివేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా గుంతలు ఏర్పడ్డాయి.
గుంతల్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా పోయిం ది. ఈ నేపథ్యంలో విజయక్రాంతి సమగ్ర వివరాలతో ’నడవడానికి రావడం లేదు’ శీర్షికతో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. విజయ క్రాంతి కథనం జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో 24 గంటల లోపు స్పందించి గుంతల రోడ్డును పూడ్చి వేయించారు. విజయక్రాంతి కథనంపై ప్రశాంత్ నగర్ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.