23 June, 2026 | 10:20 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

దంచి కొట్టిన వాన..

23-09-2025 12:00 AM

పత్తి రైతుల ఆందోళన..

రేగొండ సెప్టెంబర్ 22(విజయక్రాంతి): సోమవారం సాయంత్రం భూపాలపల్లి, రేగొండ వ్యాప్తంగా వాన దంచి కొట్టింది.గత రెండు రోజుల నుండి ఉక్కపోతతో కూడిన ఎండలు జిల్లా వ్యాప్తంగా ఉండగా సోమవారం సాయంత్రం మాత్రం ఆకస్మికంగా వచ్చిన వాన కుండపోతగా కురిసింది.ఈ వర్షం భారీ ఉరుములు, మెరుపులు, పిడుగులతో దంచి కొట్టింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న పత్తి రైతులు ఆందోళన చెందారు.

ఈ దసరా పండుగకు పత్తి పూత, కాతతో ఏపుగా పెరిగి పత్తి పండడానికి సిద్ధంగా ఉంది.ఈ క్రమంలోనే ఈ వాన దంచి కొట్టడంతో పత్తి లోని పూత,కాయ రాలుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వాన ఒక్కసారిగా కుండ పోతగా  కురవడంతో రహదారులు, పంట పొలాల పై నుండి వరదలు వెళ్లాయి.