calender_icon.png 9 November, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలను చైతన్యవంతం చేసేదే ప్రజానాట్యమండలి

09-11-2025 07:11:39 PM

చిట్యాల (విజయక్రాంతి): కళ కాసుల కోసం కాదు, ప్రజలందరి కోసం అని నినదించి, పీడిత ప్రజలను చైతన్యవంతం చేసేది ప్రజానాట్య మండలి అని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్ ఆదివారం అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో జరిగిన ప్రజా నాట్యమండలి మండల మహాసభకు ఆయన విచ్చేసి మాట్లాడారు. కార్మక, కర్షక, విద్యార్థి, యువజన, మహిళా ఉద్యమాలకు వెన్నంటి, పాలకవర్గ విధానాలను ప్రజలకు వివరించే కళా సంపద ప్రజా నాట్యమండలి అని చెప్పారు. మహాసభల ప్రారంభ సూచకంగా ఏర్పాటు చేసిన జెండాను శంకర్ ఆవిష్కరించారు. అనంతరం ప్రజా నాట్య మండలి చిట్యాల మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు తెలిపారు.