calender_icon.png 29 June, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురుషుల విషయంలో సీన్ రివర్స్!

29-06-2025 02:19:14 AM

పురుషుల విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. ఒకప్పుడు టీవీ చానల్లో, వార్త పత్రికల్లో భర్త చేతిలో భార్య మృతి, కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త లాంటి వార్తలు వినిపించేవి, కనిపించేవి. కానీ ఇటీవల కాలంలో సీనంతా రివర్స్ అయ్యింది. కొంత మంది భా ర్యల చేతిలో భర్తలు చనిపోతున్న ఘటనలు ఈమధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నా యి.

ప్రియుడితో కలిసి చంపడం, హనీమూ న్ అంటూ తీసుకెళ్లి హతమార్చడం, సుపారీ ఇచ్చి చంపించడం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా ఓ రౌడీ షీటర్ సైతం ఇటీవలి కాలంలో భార్య బాధి తుడయ్యారంటే పరిస్థితి ఎంతలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు రకరకాల కారణాలుంటున్నాయి. అయితే కొంత మంది భార్యలు తన భర్త ప్రవర్తన నచ్చకనో, వేరే పురుషుడితో వివాహేతర సంబంధాలు పెట్టుకొనో..

భర్త అడ్డుతొలగించుకుంటున్నట్టు వార్తల్లో చూస్తున్నాం. ఈవిధమైన ఘటనలు దేశవ్యాప్తంగా ఈ మధ్య ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అందరు మహిళలు అలా ఉంటారని కాదుగానీ, కొంత మంది స్వార్థం, ప్రేమ, వివాహేతర సంబంధాల కారణాలతో భర్తలను అడ్డుతొలగించుకుంటున్నారు. రమేష్ మోతె