calender_icon.png 7 May, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత ప్రభుత్వం సమస్యలు పట్టించుకోలే

07-05-2025 12:17:49 AM

కాంగ్రెస్ వచ్చాకే అభివృద్ధి ఎమ్మెల్యేకు చర్చి కాంపౌండ్ వాసుల కృతజ్ఞతలు

ఎల్లారెడ్డి, మే 6 : గత ప్రభుత్వ పాలనలో గత నాయకులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్న, ప్రధాన రహదారి నుండి చర్చి వరకు సిసి రోడ్డు నిర్మాణం కొరకు ఎన్నోసార్లు పలువురు నాయకులకు విన్నవించుకున్న ఫలితం శూన్యం అయిపోయింది.

ప్రజా ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో మదన్మోహన్ ఇచ్చిన మాట ప్రకారం సీసీ రోడ్డును చర్చి వరకు నిర్మాణం కొరకు వెంటనే మంజూరు చేసి పనులు ప్రారంభించే విధంగా కృషి చేశారని ఎమ్మెల్యే మదన్ మోహన్ పట్ల ఎల్లారెడ్డి చర్చి కాంపౌండ్ వాసులు తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎల్లారెడ్డి పరిధిలోని ఆరో,వార్డులో స్థానిక సి ఎస్ ఐ కి సంబంధించిన రోడ్డు కొరకు ఎన్నోసార్లు గత ప్రభుత్వాల కు విన్నవించుకున్న నెరవేరని రోడ్డు గౌరవ ఎమ్మెల్యే మదన్మోహన్  సాంక్షన్ చేసి ఎన్నో సంవత్సరాల కలను సాకారం చేసినందుకు ఎల్లారెడ్డి సి ఎస్ ఐ ప్రెస్ బిట్ ఇంచార్జ్ ఫాదర్ రెవ ప్రభాకర్  ఎమ్మెల్యే మదన్మోహన్ కు,ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎల్లారెడ్డి, నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు కారంగుల సుజిత్  ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలియజేశారు. మరియు మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బిట్ల సురేందర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మయ్య రత్నం  గజ్జల శివరాములు రాజా ఎలీషా జంగం విజయ్ చైతన్య డేవిడ్  మహిళలు జయప్రద  రేవతి గ విజయ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.