07-05-2025 12:17:51 AM
-ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్, మే 6(విజయక్రాంతి): హైదరాబాద్ హైచ్‌ఐసీసీ కన్వెన్షన్‌లో మంగళవారం హైబిజ్ టీవీ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రింట్, ఎలక్ట్రానిక్, రేడియో మాధ్యమాల్లోని వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి హైబిజ్ టీవీ అవార్డులు ప్రదానం చేశారు. ఈ అవార్డుల ఎంపికలో భాగంగా మెట్రో ఇండియా ఇంగ్లీష్ డైలీ దినపత్రికకు సంబంధించి మార్కెటింగ్ విభాగంలో ఉత్తమ ప్రతిభ చూపిన పత్రిక జనరల్ మేనేజర్ సింగీతం రామకృష్ణకు విశిష్ట అవార్డును అందజేశారు.