గొర్లకాపరుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
చొప్పదండి 18 ఆగస్టు (విజయక్రాంతి): చొప్పదండి మండలంలోని ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం గ్రామాల అధ్యక్షులు సహకార సంఘం డైరెక్టర్ దాడి సదయ్య అధ్యక్షతన చొప్పదండి పశు వైద్యశాలలో నూతనంగా ఎన్నికైన కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ పాలక వర్గాన్ని ఘణంగా సన్మానించారు.
ఈ సందర్భంగా చైర్మన్ బాషవేణి మల్లేశం యాదవ్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో గొర్ల కాపరుల సమస్యలు తెలుసుకోవడానికి ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు. సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వారి సలహాలు సూచనలు స్వీకరించి తదనుగుణంగా సంఘ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. పాలక వర్గం ఏకగ్రీవానీకి సహకరించిన గ్రామల అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం చొప్పదండి గ్రామ అధ్యక్షులు గుంటి మల్లన్న ఆధ్వర్యంలో నూతన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిగుర్ల శ్రీనివాస్ కురుమ, డైరెక్టర్ లు అగిత రవిందర్, కా ల్వ సురేష్ యాదవ్, బండి మల్లయ్య యాదవ్, చౌటపల్లి రంజిత్ యాదవ్, దాడి ఆంజనేయులు యాదవ్ అఖిల భారత యాదవ సంఘం మండల అధ్యక్షులు రాపె ల్లి అయిలయ్య యాదవ్, పశు వైద్య సిబ్బం ది డాక్టర్ జోష్నా రామకృష్ణ, ఏం శ్రీనివాస్, గ్రామ సహకార సంఘాల అధ్యక్షులు పానుగంటి ఆగయ్య యాదవ్, ఆవుల రాజయ్య యాదవ్ , అమరగొండ గంగయ్య కురుమ, సందవేని తిరుపతి యాదవ్, మెండ నర్సయ్య , దాడి అంజయ్య,మెండ లచ్చయ్య, దాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






