19 August, 2026 | 2:59 AM

లగ్డారం రైతుల తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు

19-08-2026 12:05 AM

అమీన్‌పూర్, ఆగస్టు 18 : లగ్డారం రైతుల సమస్యపై మంగళవారం హైకోర్టు అడ్వకేట్ ఐలాపూర్ మాణిక్ యాదవ్ రైతుల తరఫున లంచ్ మోషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు లగ్డారం ప్రాంతానికి వచ్చి రైతుల పంటలను నాశనం చేసిన ఘటనను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

రైతులకు న్యాయం జరిగేలా, వారి భూముల విషయంలో చట్టపరమైన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అడ్వకేట్ ఐలాపూర్ మాణిక్ యాదవ్  మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగే వరకు, వారి భూముల హక్కుల కోసం చట్టపరంగా చివరి వరకు పోరాడుతానని స్పష్టం చేశారు.