18 April, 2026 | 4:00 AM

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

18-04-2026 01:13 AM

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన హోరు 

మహబూబాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ల ఐక్య కార్యచరణ సమితి, తెలంగాణ మున్సిపల్ సెంట్రల్ ఫోరం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు, శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మండల, డివిజన్, జిల్లా కేంద్రా ల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాం డ్ చేస్తూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. పలుచోట్ల ధర్నాలు, నిరసన దీక్షలు నిర్వహించారు.

మహబూబాబాద్  కలెక్టర్ కార్యాలయం,  మున్సిపల్ కార్యాలయం ముందు భోజన విరామ సమయం లో అన్ని తరగతుల ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలను ధరించి, నిరసన కార్యక్రమాన్ని చేప ట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ సెంట్రల్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి సింగు రమేష్, సంఘం జిల్లా నాయకులు చింతల శ్రీనివాస్ లు మాట్లాడుతూ,

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం  ( సిపిఎస్ ) ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని ( ఓ పి ఎస్ )  ను అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులందరికీ స్మార్ట్ హెల్త్ కార్డులను మంజూరు చేయాలని ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభు త్వం ముందుంచిన 63 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, లేని తీరుకు, రాను న్న కాలంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.