గురుకుల అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలి
మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి) : రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు విచారం వ్యక్తం చేశారు. వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంత్రులు, అధికారులు, చివరకు సీఎం ఇంటి ముందు మోకాళ్లపై నిలబడి అభ్యర్థించినా వారి మొర ఆలకించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. పేదల పిల్లలకు రెసిడెన్షియల్ విద్యను అందించే లక్ష్యంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసి, 9210 టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టగా, అంతలోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించిందని తెలిపారు. దీంతో సుమారు 2500 పైగా టీచర్ పోస్టులు మిగిలిపోయాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, హై తీర్పు ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.






