26 July, 2026 | 6:01 AM

గురుకుల ఉద్యోగాల భర్తీ డిసెండింగ్ ఆర్డర్‌లో చేపట్టాలి

27-06-2024 01:14 AM

గురుకుల అభ్యర్థుల డిమాండ్.. ముఖ్యమంత్రి ఇంటి వద్ద నిరసన 

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి) : గురుకులాల్లో ఉద్యోగాల భర్తీని డిసెండింగ్ ఆర్డర్‌లో చేపట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసం, పెద్దమ్మగుడి వద్ద భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. సీఎం నివాసం వద్దకు చేరుకున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి గాంధీభవన్‌కు చేరుకుని ఆందోళన నిర్వహించారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. తమకు న్యాయం చేయాలని మంత్రులు, అధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.