26-08-2025 08:44:31 AM
తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): సోమవారం రోజున వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మిడ్ మానేరు నిర్వాసితుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ నిర్వాసితులకు ఇస్తామని చెప్పిన ఐదు లక్షల 4 వేల రూపాయలు వెంటనే ప్రకటించాలని, ఇండ్ల నష్టపరిహారం రానివారికి, పట్టా ప్యాకేజీలు రాని వారికి, యువతి, యువకులకు పట్టా ప్యాకేజీ వెంటనే అందించాలని వేములవాడ అర్బన్ మండలం నంది కమాన్ చౌరస్తా నుండి వేములవాడ అర్బన్ తహసిల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి బైక్ ర్యాలీగా వెళ్లి, తాసిల్దార్ కు ఇట్టి సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వానికి చేరే విధంగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఎర్ర మహేష్, కుమ్మరి శంకర్, ఏ రెడ్డి రాజిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చంద్రగిరి ప్రశాంత్, నర్సింగోజు శంకర్, మండల ఉపాధ్యక్షులు ఏరుగొక్కుల రమేష్, జింక శ్రీనివాస్, తిప్పర వేణి రాజు, బీ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మోర్చాల అధ్యక్షులు కోనే భాస్కర్, నాంపల్లి అరవింద్, సీనియర్ నాయకులు గుండెకర్ల లక్ష్మణ్, చల్లా నర్సయ్య, పోచంపల్లి భాను, కార్యదర్శులు సంజీవరెడ్డి, చుక్కల మధు, బూతు అధ్యక్షులు నాగుల సురేష్, రెడ్డి వేణి రవి, బూర శేఖర్, పూర్ణచంద్ర గౌడ్, లక్ష్మారెడ్డి, ముధం శ్రీనివాస్, ముడికే రాములు, చుక్కల ప్రశాంత్, గడ్డి ప్రశాంత్, మహేష్ యాదవ్, బొల్లు తిరుపతి, మచ్చ అఖిల్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.