26-08-2025 08:42:16 AM
ప్రాణాలు కాపాడుకోవడం కోసం ములుగు ఏరియా ఆస్పత్రికి వెళ్లిన గర్భిణీ స్త్రీలు
ఏటూరునాగారం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) ఏటూరునాగారం ప్రభుత్వ దవఖానలో నెలలు నిండిన నిండు గర్భిణీ స్త్రీల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైద్య సిబ్బంది. సోమవారం ఉదయం ఆపరేషన్ చేస్తామని అంత సంసిద్ధం చేసి, సోప్ వాటర్ తో ఇనిమా కూడా చేసి, గర్భిణీ స్త్రీలు ఆపరేషన్ కి పస్తులతో పడిగాపులు కాస్తుంటే" తీర ఆపరేషన్ సమయానికి డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో గర్భిణీ స్త్రీలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నీరసంతో సొమ్మసిల్లిపోయారు. ఒక మహిళ పరిస్థితి ఆదివారం సాయంత్రం విషమించడంతో కుటుంబ సభ్యులు ఆ గర్భిణీ స్త్రీని ములుగు ఏరియా హాస్పిటల్ కి తీసుకువెళ్లారు.
సోమవారం ఉదయం మరోక మహిళకి నొప్పులు మొదలవడంతో డాక్టర్లు అందుబాటులో లేని ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోవడం కంటే" ములుగు చేరడమే మంచిది అని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను కూడా సోమవారం ఉదయం ములుగు ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు.. మిగిలిన గర్భిణీ స్త్రీలు దేవుడా మాకు దిక్కు ఎవరు అని ఏటూరునాగారం ప్రభుత్వ హాస్పటల్ లోనే ప్రసవవేదన భరిస్తూ డాక్టర్ కోసం ఎదురుచూస్తున్నారు.. మారాల్సింది ప్రభుత్వం కాదు పాలన శైలి అని బాధితులు మీడియా ముఖంగా మండిపడ్డారు.