2 May, 2026 | 1:08 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

12-03-2026 12:34 AM

ఎక్సైజ్ సూపరింటెండెంట్ వినతి పత్రం అందచేత

కన్నాయిగూడెం,మార్చి11(విజయక్రాంతి): కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని 50సంవత్సరాలు నిండిన వారికి కల్లు గీత వృత్తి పింఛన్ సైట్ ఓఫన్ చేసి తక్షణమే ఇవ్వాలని తాటి ఈత చెట్ల పెంపకం కోసం జీవో నంబర్ 560 ప్రకారం 10ఎకరాలు భూమి ప్రభుత్వం కొని ఇవ్వాలని ఎన్నికల ముందు గీత కార్మికులకు ఇచ్చిన హామీలు హమలు చేయాలనీ ఇతర సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ కల్లుగీత కార్మిక సంఘం కన్నాయగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో ఏటూరునాగారం ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చిన ఎక్సైజ్ సూపర్డెంట్ కి సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

అనంతరం సంఘం మండల అధ్యక్షులు పాలకుర్తి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో మొదటిసారి కలిసిన సందర్భంగా సూపర్డెంట్ ని మరియు సిఐ ఎస్‌ఐని కలిసి ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. అనంతరం మండల కమిటీ అధ్యక్షులు పాలకుర్తి శ్రీధర్ గౌడ్ జిల్లా కమిటీ సభ్యులు తాటి లచ్చలు గౌడ్ మాట్లాడుతూ కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తాటి యాదగిరి కార్యదర్శి పాలకుర్తి మధు గౌడ్,నవీన్ గౌడ్,కనకసేన గౌడ్,తడూ రి నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.