9 May, 2026 | 2:19 PM

Breaking News

ఆడబిడ్డ పెళ్లికి రూ.50,000 సాయం   •   మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •  

జీవిత ఖైదీల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలి

24-03-2026 12:00 AM

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ముందస్తు విడుదలకు అర్హులైన 102 మంది జీవిత ఖైదీల జాబితాను తక్షణమే ఆమోదించి, వారిని విడుదల చేయాలని తెలంగాణ మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్వీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. రాష్ట్ర హోం శాఖ ఇప్పటికే సిద్ధం చేసిన ఈ జాబితాలో ఆరుగురు మహిళలు సహా మొత్తం 102 మంది జీవిత ఖైదీలు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫైల్ తుది ఆమోదం కోసం ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నట్లు మాకు సమాచారం ఉంది.

సీఎం సార్.. గతంలో జారీ చేసిన జీవో నంబర్- 126 నిబంధనల ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదలకు అర్హులైన ఖైదీల వివరాలను సమీక్షించాల్సి ఉంది. తర్వాత,  కొత్త జాబితాను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫేజ్-2 ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, జనవరి 1 నుంచి మార్చి 31 వరకు నిర్వహించాల్సిన తదుపరి సమీక్ష నిర్వహించండి. దయచేసి  ఆలస్యం చేయకండి. మానవతా, సంస్కరణా దృక్పథంతో విడుదలకు అర్హులైన ఖైదీలను రానున్న స్వాతంత్య్ర దినోత్సవం రోజు విడుదలకు చర్యలు తీసుకోండి. తద్వారా, వారి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపండి. 

 తిరుపతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మానవ హక్కుల వేదిక, 

జీవన్ కుమార్, కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు, తెలంగాణ, ఏపీ