calender_icon.png 13 June, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడమే రియల్ ఛాలెంజ్

12-06-2025 06:49:36 PM

ధనుష్(Dhanush), నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల(Sekhar Kammula) తెరకెక్కిస్తున్న పాన్‌ఇండియా చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌వీసీఎల్‌ఎల్‌పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్‌మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్‌మోహన్‌రావు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు. 

‘కుబేర’ ప్రాజెక్టు ఎలా మెటీరియలైజ్ అయింది?

-శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరీ’ తర్వాత ఈ ఐడియాను మాకు చెప్పారు. ఈ కథకు ధనుష్ అయితే బాగుంటుందని ఆయన భావించి, ఆయనకు ఈ కథ చెప్పారు. ధనుష్ 20 నిమిషాల పాటు కథ విని వెంటనే సైన్ చేశారు. తర్వాత ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. -ధనుష్ పాన్ ఇండియా స్టార్. ఆయన హిందీలో కూడా సినిమాలు తీశారు. నాగార్జున కూడా ఎప్పటినుంచో హిందీ సినిమాల్లో ఉన్నారు. రష్మిక ఇండియాలో పాపులర్ హీరోయిన్. కథకు అనుగుణంగానే ఇంత బిగ్ స్టార్ కాస్ట్‌తో ఈ సినిమాను చేశాం. ఇది తెలుగు, తమిళ్ స్ట్రుటై మూవీ. హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. ఇప్పటికే తొలి కాఫీ సిద్ధమైంది. సినిమా అద్భుతంగా వచ్చింది. 

శేఖర్ కమ్ముల ఫస్ట్ టైమ్ ఇంత బిగ్ స్టార్ కాస్ట్‌తో సినిమా చేస్తున్నారు కదా? ఇది ఎంత డిఫరెంట్‌గా ఉండబోతుంది?

 -శేఖర్ కమ్ముల మాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఆయన లీడర్ సినిమా ఎప్పుడు చూసినా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఈసారి మరింత బిగ్గర్ స్టార్ కాస్ట్‌తో తీశారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతి ఇవ్వబోతుంది. చాలా విభిన్నమైన చిత్రమిది. శేఖర్ కమ్ముల స్టార్స్‌ను క్యారెక్టర్స్‌గానే చూస్తూ సినిమా తీసే ఫిలిం మేకర్. ఈ సినిమాలోనూ పాత్రలే కనిపిస్తాయి. 

కుబేర కాన్ఫ్లిక్ట్ ఏమిటి?

-మోస్ట్ రిచెస్ట్ మాన్ ఇన్ ది వరల్డ్, ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ ది స్ట్రీట్స్ ఇది కాన్ఫ్లిక్ట్.  

కుబేర కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేంటి? 

-శేఖర్ మంచి భావోద్వేగాలతో ప్రేక్షక హృదయాలను టచ్ చేస్తూ ఫీల్ ఉండే సినిమాలను తీస్తారు. ఈ సినిమా కూడా అలాంటిదే. ఇందులోని భావోద్వేగాలు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటాయి. 

షూటింగ్‌లో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు?  

-రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం ఎప్పుడూ సవాల్‌తో కూడుకున్నదే. ఈ సినిమా కోసం అన్ని రియల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశాం. రియల్ స్లమ్స్, గార్బేజ్, డంపింగ్ యార్డ్స్‌లో తీశాం. ముంబయిలో సినిమాను షూట్ చేయడం మరో ఛాలెంజ్. రియల్ వీధుల్లో సినిమాను షూట్ చేశాం. అదే రియల్ ఛాలెంజ్. మేము బడ్జెట్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కంటెంట్‌కు కావలసిన బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశాం. -సినిమాను చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. దాదాపు 1600 స్క్రీన్లలో సినిమా రిలీజ్ కాబోతోంది. చాలా అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ఉంది.  

నాగార్జునను ప్రాజెక్టులోకి ఎలా తీసుకొచ్చారు?

-నాగార్జునతో పనిచేయాలని మాకు ఎప్పటినుంచో ఉండేది. శేఖర్‌కు ఈ పాత్ర కోసం నాగార్జున తప్పితే మరొకరు కనిపించలేదు. నాగార్జునకు ఈ కథ నచ్చింది. ఈ పాత్రలో ఆయన్ను తప్పితే మరొకరిని ఊహించలేనంత గొప్పగా నటించారు.  

దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ గురించి..? 

దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా కోసం చాలా డిఫరెంట్ సాంగ్స్ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ధనుష్ రెండు పాటలు పాడారు. ఇది డైరెక్టర్, దేవిశ్రీ కలెక్టివ్ డెసిషన్.

తమిళ్‌లో కూడా మీరే రిలీజ్ చేస్తున్నారా?

-లేదండి. రాహుల్ అనే డిస్ట్రిబ్యూటర్‌కు ఇచ్చాం

సునీల్ గారు.. మీ అమ్మాయి జాన్విని నిర్మాతగా చేయాలనే భావిస్తున్నారా?

కచ్చితంగా. తనకు సినిమా నిర్మాణం పట్ల చాలా ఆసక్తి ఉంది. చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే మా బ్రదర్ వాళ్ల అబ్బాయికి కూడా ప్రొడక్షన్‌పై ఆసక్తి ఉంది.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి?

శేఖర్ కమ్ములతో మరో సినిమా చేయనున్నాం. అయితే ఇంకా హీరో ఎవరనేది ఫైనల్ కాలేదు.