30 May, 2026 | 1:50 AM

ఆకట్టుకున్న తోలుబొమ్మలాట

30-05-2026 12:00 AM

గట్టు, మే 29: మండల పరిధిల ఆరగిద్ద  గ్రామంలో సవరం అవ్వ దేవర సందర్భంగా గురువారం అర్ధ రాత్రి ఏర్పాటుచేసిన తోలుబొమ్మలాట గ్రామస్తులను ఆకట్టుకుంది. ప్రాచీన జానపద కళారూపమైన తోలుబొమ్మలాట తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించింది.మేక, జింక తోళ్లతో తయారుచేసిన బొమ్మలను, తెర వెనుక నుండి దీపపు కాంతిలో కదిలిస్తూ, కళాకారులు రామాయణ, మహాభారత కథలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  బాలకృష్ణ బొప్పల లక్ష్మన్న, బొప్పల వీరేశ్ వెంకటేష్, శ్రీను,నరసింహ వీరేశ్ తదితరులు పాల్గొన్నారు