30 May, 2026 | 12:52 AM

ఫిబిల్ సిటీ రోడ్డు పనులేవి?

30-05-2026 12:00 AM
  1. రూ. 2 కోట్లు మంజూరు చేసినా పూర్తి కానీ బిటి రోడ్డు 
  2. గత సెప్టెంబర్‌లో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్
  3. ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం?

రాజేంద్రనగర్, మే 29 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగిర్ లోని ఫీబల్ సిటీ బీటీ రోడ్డు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి 2025 జూన్ . ఆగస్టు మధ్యలో బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్+ గా ఉన్న సమయంలో ఈ రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి రెండు కోట్ల రూపాయలను కేటాయించారు . ఈ నిధులతో దాదాపు 900 మీటర్ల పొడవునా సి సి మరియు బి టి రోడ్డు నిర్మించాలి ఇందులో 90 మీటర్లు సిసి రోడ్డు మిగతా ఎనిమిది వందల పది మీటర్ల పొడవునా బిటి రోడ్డును నిర్మించాలి నిధులు మంజూరు చేసి దాదాపు ఏడాది కావస్తుంది.

రోడ్డు నిర్మాణం కోసం గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్  శిలాఫలకాన్ని ఆవిష్కరించారు . అనంతరం చాలా రోజుల వరకు సిసి రోడ్డు నిర్మించకపోవడంతో పలుమార్లు విజయ క్రాంతి దినపత్రిక లో పలు కథనాలు రావడం వల్ల అధికారులు స్పందించి 90 మీటర్ల సిసి రోడ్డును నిర్మించారు. కానీ మిగిలిన 

810 మీటర్ల పొడవునా బీటీ రోడ్డు నిర్మించాలి కానీ అధికారులు బిటి రోడ్డు నిర్మాణానికి రోడ్డుకు ఇరువైపులా మట్టిని తొలగించి కంకర పరిచారు ఈ కంకర పరిచి కూడా దాదాపు 8 నెలలు కావస్తున్న రోడ్డు నిర్మాణం మాత్రం ప్రారంభించడం లేదు ఈ రోడ్డు అసంపూర్తిగా ఉండటంవల్ల స్నేహ హిల్స్ ఫైబల్ సిటీ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై స్నేహిత హిల్స్ కాలనీవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నిధులు ఉన్న రోడ్డు నిర్మాణం చేపట్టడంలో రాజేంద్రనగర్ సర్కిల్ ఇంజనీరింగ్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థంకాని పరిస్థితి స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అయినా స్పందించి ఈ రోడ్డు నిర్మాణానికి మోక్షం లభించే విధంగా అధికారులను ఆదేశించాలని కాలనీవాసులు కోరుతున్నారు..