ఓటు హక్కు వినియోగించుకోవాలి
సిద్దిపేటలో 5కె రన్ ప్రారంభించిన జిల్లా ఎన్నికల అధికారి మనుచౌదరి
ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలి
సిద్దిపేట, మే 5 (విజయక్రాంతి) : స్వేచ్ఛా వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. మనుచౌదరి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా 5కె రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఓటు హక్కు వినియోగించు కోవడం చైతన్యవంతుల లక్షణమన్నారు. మెదక్ పార్లమెం టు ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరా రు. హుస్నాబాద్ నియోజకవర్గం, బెజ్జంకి మండలాలు కరీంనగర్ పార్లమెంటు నియోజక వర్గంలో, చేర్యాల, మద్దూరు, లద్దునూ రు, దూల్‌మిట్ట, కొమురవెళ్లి మండలాలు భూవనగిరి నియోజకవర్గంలో పరిధిలో ఓటు వేయాల్సి ఉంటుందని చెప్పారు.
ఎన్నికలకు అన్ని ఏర్పా ట్లు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో వాకార్స్, సైక్లింగ్ అసోసియేషన్స్, విద్యార్థులు, పిల్లలు, స్వీఫ్ నోడల్ అధికారి జయదే వ్ ఆర్య, వివిధ మండలాల తహసీల్దార్లు, డీఆర్‌డీఏ ఉద్యోగులు, డిగ్రీ కళాశాల అధ్యాపకు లు పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు దరఖా స్తు చేసుకున్న ఉద్యోగులు ఓటు వేయాలని సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సూచించారు. సిద్దిపేటలో ఆర్డీవో కార్యాలయం, దుబ్బాక ఇంటిగ్రేటెడ్ కార్యాలయం, గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ కార్యాలయం, హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలో బ్యాలెట్ కేంద్రాలు ఏర్పాటు చెసినట్టు తెలిపారు. ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోని ఓటర్లకు ఆదర్శంగా నిలువాలని కోరారు. ఉదయం 10:30గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.




