3 June, 2026 | 1:02 AM

తెలంగాణ సాయుధ, స్వరాష్ట్ర పోరాటాలలో కమ్యూనిస్టుల పాత్ర అనన్యం

03-06-2026 12:21 AM

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

కొత్తగూడెం , జూన్ 2,  (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ, స్వరాష్ట్ర పోరాటాలలో కమ్యూనిస్టుల పాత్ర అనన్యమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు సిపిఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం ’శేషగిరిభవన్’లో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సాబీర్ పాషా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జరిగిన సదస్సులో తెలంగాణ సాయుధ పోరాటంలో, స్వరాష్ట్ర సాధన పోరాటంలో మృతి చెందిన అమరవీరులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగిన వీరోచిత తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరం ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  అమరవీరుల త్యాగాల పునాదులపైనే నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిందని, మలిదశ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర చిరస్మరణీయ మని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల గొంతుకగా నిలిచామని గుర్తుచేశారు. 

కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాస రావు,  కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, ఎస్ కె ఫహీమ్, జిల్లా సమితి సభ్యులు కొమారి హన్మంతరావు, నేరెళ్ల రమేష్, కె రత్నకుమారి, మునిగడప పద్మ, మునిగడప వెంకటేశ్వర్లు, జక్కుల రాములు, నాయకులు, కార్పొరేటర్లు ఎండి యూసుఫ్, షాహీన్, ధనలక్ష్మి, శాంతిప్రియ, ఎమ్ హరిత,నామా కీర్తి, పడాల ఆకాంక్ష, అన్నపూర్థ, శ్యామల, బోయిన విజయ్ కుమార్ పాల్గొన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజల సంక్షేమ, అభివృధ్ధికోసం స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు చేస్తున్న కృషికి ప్రతిఒక్కరు సహకారం అందించాలని కోరారు.