19-12-2025 02:04:26 AM
హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాం తి) : విద్యారంగంలో ఎన్జీవోల పాత్ర పెరగడం ఆందోళన కలిగిస్తోందని, పరోక్షంగా ప్రైవేటీకరణకు దారులు వేసే ప్రమాదం ఉందని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ. వెంకట్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించి నాణ్య మైన విద్యను అందించేందుకు కృషి చేయాలని కోరారు.
ఫిజిక్స్‌వాలా, ఖాన్ అకాడమీ వంటి సంస్థలతో ఒప్పందాలతో క్లాసులు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో జనగామలో నిర్వహించే టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశాల గోడపత్రికను గురువారం టీఎస్ యూటీఎఫ్ కార్యాలయం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చావ రవి, వెంకట్ మాట్లాడుతూ ఉపాధ్యాయులను స్వేచ్ఛగా పాఠాలు చెప్పనివ్వాలన్నారు. భోధనేతర పనుల భారం నుంచి విముక్తులను చేయాలని, ఆన్‌లైన్ నివేదికలు పంపడానికి బోధనేతర సిబ్బందిని కేటాయించాలని కోరా రు.
టెట్ పరీక్షపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభు త్వం నుంచి స్పందన లేదన్నారు. ఈ తీర్పు తెలంగాణలో 45 వేల మంది, దేశ వ్యాప్తంగా 25 లక్షల మందిపై ప్రభావ పడుతోందని తెలిపారు. జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ సం ఘాలు ఐక్య ఉద్యమాలకు సిద్దం అవుతున్నాయన్నారు. కేంద్ర , రాష్ట ప్రభుత్వాలు ఉపాధ్యా యుల ప్రయోజనాలు కాపాడాలని కోరారు.