calender_icon.png 20 December, 2025 | 12:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

లింగంపల్లి సర్పంచ్‌ను సన్మానించిన సంగారెడ్డి ఎమ్మెల్యే

19-12-2025 12:00:00 AM

మునిపల్లి, డిసెంబర్ 18 :  మునిపల్లి మండలం లింగంపల్లి సర్పంచ్ ఇర్ఫాన్ పటేల్ గురువారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ను సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ గా ఎన్నికైన ఇర్ఫాన్ పటేల్ ను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి పుష్ప గుచ్చంతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు వారి ఇబ్బందులు, సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన వారిలో బీఆర్‌ఎస్ నేతలు ఆర్.వెంకటేశ్వర్లు, జీవి శ్రీనివాస్, విఠల్, మసుధ్, ముజీప్, మునిపల్లి మాజీ వైస్ ఎంపీపీ బాబా పటేల్, లింగంపల్లి బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆఫ్సార్, నాయకులు సంపత్, మతిన్, సాజిత్ తదితరులు ఉన్నారు.