19-12-2025 12:00:00 AM
హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి): స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఐఈఈఈ కమిటీ ఆధ్వర్యంలో పదవ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ (రీసెర్చ్ ఇన్ ఇంటిలిజెంట్ కంప్యూటింగ్ ఇంజనీరింగ్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ వి బాలకిస్టారెడ్డి (చైర్మన్, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్), ప్రొఫెసర్ గుయేన్ (హానోయ్ యూనివర్సిటీ ఆఫ్ ఇండస్ట్రీ, వియత్నాం), ప్రొఫెసర్ అతుల్ నేగి (డీన్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెన్సైస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్), ప్రొఫెసర్ ఏ కృష్ణయ్య (యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ) తదితరులు హాజరవుతున్నారు.
కళాశాల చైర్మన్ బిషప్ ఏ శామ్యూన్, సెక్రటరీ, కరెస్పాండెంట్ కే కృష్ణారావు, మేనేజ్మెంట్ సభ్యులు టి రాకేష్‌రెడ్డి, ఆర్ ప్రదీప్‌రెడ్డి పాట్రన్స్‌గా వ్యవహరించనున్నారు. కో ప్యాట్రన్స్‌గా కళాశాల ప్రిన్సిపల్ డా బిఎల్ రాజు, డా. ఏ వినయ బాబు (డీన్ అకాడమిక్స్), డా. సత్యప్రసాద్ లంక (డీన్ ఇన్నోవేషన్ అండ్ ప్లానింగ్) వ్యవహరిస్తారు. జనరల్ చైర్ గా డా. శివాని యాదవ్, కన్వీనర్స్ గా డా జి శ్రీలత, డా. జి. కార్తీక్, డా. పి నారాయణ వ్యవహరించనున్నారు. వివిధ విశ్వవిద్యాలయాలు, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్ నుంచి డెలిగేట్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొననున్నారు.