3 July, 2026 | 8:55 PM

Breaking News

ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •  

ఆరు వర్సిటీల సెర్చ్ కమిటీ సమావేశాలు పూర్తి

05-10-2024 01:19 AM

నాలుగు వాయిదా

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పది యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ల నియామక ప్రక్రియ గందరగోళంగా సాగుతోంది. వీసీల ఎంపిక కోసం జరగాల్సిన సెర్చ్ కమిటీల సమావేశాలు వరుసగా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికి మొత్తం నాలుగు యూనివర్సిటీల సెర్చ్ కమిటీలు వాయిదాపడ్డాయి.

శుక్రవారం జేఎన్టీయూ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ, కాకతీయ యూనివర్సిటీలకు సంబంధించిన సెర్చ్ కమిటీలు సమావేశం కావాల్సి ఉండగా, తెలంగాణ, కాకతీయ వర్సిటీ సమావేశాలు వాయిదా పడ్డాయి.

గురువారం పాలమూరు, తెలుగు, ఓయూ, అంబేద్కర్ వర్సిటీ సమావేశాలు జరగాల్సి ఉండగా అంబేద్కర్ వర్సిటీ సమావేశం వాయిదా పడింది. అంతకుముందే ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ సమావేశం వాయిదా పడింది. నామినీలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికి మొత్తం ఆరు వర్సిటీల కమిటీల సమావేశాలు మాత్రమే పూర్తయ్యాయి.

ఈనెల 1న మహాత్మాగాంధీ, 2న ఉస్మానియా, తెలుగు వర్సిటీ, పాలమూరు వర్సిటీలు, శుక్రవారం జేఎన్టీయూ, శాతవాహన వర్సిటీల సమావేశాలు పూర్తయ్యాయి. తెలంగాణ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, ఫైన్‌ఆర్ట్స్, కాకతీయ వర్సిటీ కమిటీలు ఇంకా సమావేశం కావాల్సిఉంది. వీటిని కూడా త్వరలోనే పూర్తి చేసే పనిలో అధికారులున్నారు.