25 July, 2026 | 4:55 PM

రెండో చిత్రం రామ్‌తో..

21-11-2024 12:00 AM

‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది మరాఠీ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. తెలుగులో మొదటి సినిమాతోనే గ్లామరస్ హీరోయిన్‌గా, యాక్టింగ్ చేయగల నటిగా పేరు తెచ్చుకుందీ బ్యూటీ. అంతేనా? తెలుగు తనకు మాతృభాష కాకున్నప్పటికీ తొలి సినిమాకే చాలా చక్కగా డబ్బింగ్ చెప్పుకొని ఇండస్ట్రీ ప్రముఖుల మెప్పు పొందింది.

అలా తెలుగునాట సంతృప్తికరమైన ఖాతాను తెరిచిన ఈ చిన్నది తాజాగా టాలీవుడ్‌లో తన రెండో సినిమా కోసం రామ్ పోతినేనితో జత కట్టనుంది. రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే ఎంపికైనట్టు చిత్ర వర్గాల ద్వారా తెలిసింది. రామ్‌కు 22వ సినిమా ఇది.

మహేశ్‌బాబు పీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. ఈ సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. దర్శకుడు మహేశ్‌బాబు పీ ఈ సినిమానూ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ మెచ్చే కథతో తెరకెక్కించనున్నారట. సినిమా ముహూర్తం రోజున ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.