లక్కీ భామకు మరో ఛాన్స్
‘లక్కీ భాస్కర్’ చిత్రంలో ఏమంటా నటించారో కానీ మీనాక్షి చౌదరికి లక్కు లక్కలా అతుక్కుపోయినట్టుంది. వరుస సినిమా అవకాశాలు కొట్టేస్తున్నారు. ఒక్క నెల వ్యవధిలోనే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆమెకు సంబంధించిన రెండు సినిమాలు.. ‘లక్కీ భాస్కర్, మట్కా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆమె నటించిన ‘మెకానిక్ రాకీ’ రేపు విడుదల కానుంది.
ప్రస్తుతం అమ్మడికి హీరో నాగ చైతన్య సరసన నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం నాగ చైతన్య ‘తండేల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు.
ఒకరు పూజా హెగ్డే ఆల్రెడీ ఫిక్స్. మరొక హీరోయిన్‌గా మీనాక్షిని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై మీనాక్షితో మేకర్స్ మంతనాలు కూడా జరిపారట. ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి ‘లక్కీ’ భామకు తెలుగులో మరో అవకాశం దక్కింది.






