13 April, 2026 | 4:23 PM

Breaking News

మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్   •   ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •  

ప్రశాంతంగా పోలింగ్

14-12-2025 06:11 PM

* మండలంలో 85.82% నమోదు 

* అత్యధికంగా పీచుపల్లిలో 92.98%

* కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం 

చిగురుమామిడి (విజయక్రాంతి): రెండో విడత పంచాయతీ ఎన్నికలు మండలంలో ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. తీవ్ర చలి కారణంగా ఉదయం 9 గంటల వరకు మందకోడిగా సాగగా, ఆ తర్వాత ఊపందుకుంది. మండలంలోని 17 పంచాయతీల్లో కలిపి 85.82% పోలింగ్ నమోదు కాగా, అత్యధికంగా పీచుపల్లిలో 92.98% నమోదైంది. కాగా చిన్న ముల్కనూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు.

కాగా చిగురుమామిడిలో 84%, సుందరగిరిలో 87.26%, రేకొండలో 85%, బొమ్మనపల్లిలో 82.06%, నవాబుపేటలో 86.44%, కొండాపూర్ లో 87.25%, గాగిరెడ్డిపల్లి లో 88.74%, లంబాడిపల్లి లో 89.83%, ముదిమాణిక్యం లో 85.60%, సీతారాంపూర్ లో 90.41%, ముల్కనూర్ లో 87.75%, రామంచ లో 87.84%, గునుకుల పల్లి లో 85.46%, ఇందుర్తిలో 82.14%, ఉల్లంపల్లి లో 86.77%, ఓగులాపూర్ లో 86.79% పోలింగ్ నమోదైంది. కాగా తన స్వగ్రామమైన రేకొండలో సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.