calender_icon.png 15 December, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శబరిమలకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు

14-12-2025 06:08:37 PM

పాపన్నపేట (విజయక్రాంతి): మండల కేంద్రం పాపన్నపేటలోని అయ్యప్ప స్వామి క్షేత్ర సన్నిధానంకు చెందిన అయ్యప్ప స్వాములు ఆదివారం ఇరుముడి ధరించి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరారు. 41 రోజుల పాటు కఠోరమైన దీక్షను నియమ నిబంధనలతో పాటించారు. కృష్ణ గురు స్వామి అయ్యప్ప స్వాములకు ఇరుముడి కట్టారు. 18 మెట్ల పూజ అనంతరం ఇరుముడి నెత్తిన ధరించి శబరిమలకు బయలుదేరి వెళ్లారు. స్వాముల బంధువులు, మిత్రులు ఇట్టి కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై అయ్యప్ప స్వాముల ఆశీర్వాదాన్ని పొందారు.