09-10-2024 12:10:11 PM
గజ్వేల్ (విజయక్రాంతి): నిత్యం గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఎనలేనివని శ్రీగిరిపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి వేణు అన్నారు. బుధవారం దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం తరఫున పారిశుధ్య కార్మికులకు రెండు జతల చొప్పున దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలకు పారిశుధ్య సేవలో అందించడం ఎంతో ముఖ్యమైనదన్నారు. పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలకు వారిని ప్రజలంతా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు కుమార్, వెంకట్, కరుణాకర్, అమరేందర్ రెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.