లైన్‌మెన్ల సేవలు అభినందనీయం
బెజ్జూర్, మార్చి 4 (విజయక్రాంతి): లైన్‌మెన్ల సేవలు అభినందనీయమని ఏఈ అంజల్‌కుమార్ అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో బుధవారం ‘నేషనల్ లైన్మెన్ డే‘ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అంజల్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ వ్యవస్థలో లైన్మెన్లు క్షేత్రస్థాయిలో పనిచేసే నిజమైన వీరులు అని వారి సేవలను కొనియాఆడారు. విద్యుత్ తీగలతో పనిచేయడం ఎంతో ప్రమాదకరమైనది.
వర్షం, ఎండ, చలి అని చూడకుండా వారు స్తంభాలు ఎక్కి రిపేర్లు చేస్తారని తెలిపారు. తుపాన్లు లేదా భారీ వర్షాల వల్ల విద్యుత్ లైన్లు తెగిపోయినప్పుడు, యుద్ధ ప్రాతిపదికన వాటిని పునరుద్ధరించేదూకు చేస్తారన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన లైన్మెన్లకు ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ లైన్‌ఇన్స్పెక్టర్ ధర్మయ్య, లైన్మెన్లు బాలాజీ, అశోక్, చరణ్ దాస్,మల్లేష్, ఆపరేటర్లు సంతోష్, శ్రీనివాస్ సిబ్బంది రాకేష్,రమేష్,పాల్గొన్నారు.




