పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు
ఉట్నూర్, మార్చి 4 (విజయక్రాంతి): పట్టపగలే వెలిగే వీధి దీపాలు గ్రామ పంచాయతీల నిర్వహణ లోపాలని ఎత్తు చూపిస్తున్నాయి. పట్టపగలు వెలుగుతున్న వీధి దీపాలను అర్పించుటకు చాలా గ్రామ పంచాయతీ కేంద్రాలతో పాటు అనుబంధ గ్రామాల్లో స్విచ్ ఆన్ చేసే తీగలు కరువయ్యాయి. దీంతో చాలా మేరకు విద్యుత్తు వృధా కావడంతో పాటు గ్రామ పంచాయతీలపై కరెంటు బిల్లుల భారం పడుతుంది. ప్రతి గ్రామంలో 50 నుంచి 300 వరకు వీధి దీపాల స్తంభాలు ఉన్నాయి.
ఇందులో చాలా వరకు 24 గంటలు వెలుగుతున్నాయి. దీంతో అనవసరపు విద్యుత్ వినియోగంతో విద్యుత్ వృధా అవుతుంది. ఈ విషయంపై విద్యుత్ శాఖ ఏఈ రోహిదాస్ జాదవ్ మాట్లాడుతూ.. వీధి దీపాల నిర్వహణలో భాగంగా చాలా పంచాయితీలో సరియైన స్విచ్ బోర్డు లేకపోవడం, స్విచ్ బోర్డ్‌ల ఏర్పాటుపై పంచాయితీ అధికారులు దృష్టి సారించడం లేదని వాపోయారు. 24 గంటలు విద్యుత్తు దీపాలు వెలగడంతో పంచాయతీలపై కరెం టు బిల్లుల భారం పడుతుందని ఇప్పటికైనా పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు వీధి దీపాలకు స్విచ్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు.




