15 April, 2026 | 9:51 AM

మీసేవ ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయం

06-12-2025 12:00 AM

ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ మీసేవ కమిషనర్ టి. రవికుమార్

కోదాడ, డిసెంబర్ 5: కోదాడలోని మీసేవ కేంద్రాన్ని ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ మీసేవ కమిషనర్ టి. రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.. సేవల నిర్వహణ, రుసుముల వసూళ్లు, టోకెన్ విధానం, డిజిటల్ రికార్డులు తదితర అంశాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. రిజిస్టర్ పరిశీలన, లాగిన్ రిపోర్టులు, పని వేళల్లో పారదర్శకత, వేగవంతమైన సేవలపై ఆయన సిబ్బందిని ప్రశ్నించారు.సర్వీస్లను సమయానికి అందిస్తున్న తీరు, ప్రజలతో స్టాఫ్ ప్రవర్తన, పని తీరు చూసి కమిషనర్ అభినందనలు తెలిపారు.

ప్రత్యేకంగా కేంద్ర నిర్వాహకుడు కొనసాగిస్తున్న క్రమశిక్షణ, సేవలపై చూపుతున్న నిబద్ధతను మెచ్చుకున్న కమిషనర్, అందరి సమక్షంలో మీసేవ నిర్వాహకుడికి సన్మానం చేసి ప్రశంసా పత్రం అందజేశారు.  ఆయన వెంట కోదాడ ఆర్డిఓ సిహెచ్. సూర్యనారాయణ, తాసిల్దార్ వాజిద్ అలీ, ఈడియం గఫూర్ అహ్మద్, డిస్టిక్ మేనేజర్ సైదా నాయక్, మీసేవ నిర్వాహకుడు కొదుమూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు