మురుగునీటిని తొలగించి మంచినీరు నింపాలి
ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
ముషీరాబాద్,మార్చి 24(విజయక్రాంతి): బతుకమ్మ కుంటలో మురుగు నీటిని తొలగించి శుభ్రమైన నీటిని నింపాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం నియోజకవర్గంలోని బాగ్ అంబర్పేట్ డివిజన్లో గల బతుకమ్మ కుంట పరిసరాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సందర్శించి పరిశీలించారు. అక్కడి పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ బతుకమ్మ కుంట లో నిల్వ ఉన్న మురికి నీటిని తొలగించి, శుభ్రమైన నీటిని నింపాలని సంబంధిత అధికారులకు సూచించారు. కలుషిత నీటి కారణంగా దోమలు పెరిగి సమీప కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే ఉదయం, సా యంత్రం సమయంలో అక్కడికి వచ్చే ప్రజలకు కూడా అసౌకర్యం కలుగుతోందని తెలి పారు.
కుంట పరిసరాల్లో శుభ్రతను మెరుగుపరచడంతో పాటు కొత్త రోడ్లు, అవసర మైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధి కారులు జనరల్ మేజర్ శ్రీధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణ, డిఈఈ ప్రవీణ్, హైడ్రా డీఈఈ మోహన్, డీఈఈ (శానిటేషన్) రఘు, జీహెచ్‌ఎంసీ డీఈఈ ప్రవీణ్, ఎస్‌ఎఫ్‌ఏ తిరుపతి, యూబీడీ సంతోష్, శ్రీధర్, డివిజన్ అధ్యక్షుడు చంద్ర మోహన్, బీఆర్‌ఎస్ నాయకులు, కాలనీ సభ్యులు పాల్గొన్నారు.




