calender_icon.png 19 August, 2025 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రజతోత్సవ మహాసభ పెద్దఎత్తున విజయవంతం చేయాలి

07-04-2025 11:14:59 PM

బాల్క సుమన్..

గులాబీ యువ కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలి..

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): ఈ నెల 27న నిర్వహించే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ మహాసభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. సోమవారం క్యాతన్ పల్లి సుమన్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రజతోత్సవ మహాసభ విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తేనే సభ విజయవంతం చేయడం చాలా సులువవుతుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమ అభివృద్ధిని పక్కనపెట్టి అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఎండగట్టారు. బిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ డా.రాజరమేష్, మాజీ జడ్పిటిసి వేల్పుల రవి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కంబాగోని సుదర్శన్, రవీందర్, మాజీ కౌన్సిలర్లు, జైపూర్ మండల అధ్యక్షుడు అరవిందర్ రావు, మేడి తిరుపతి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.