సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ ఉత్తమ సేవలు అందించాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
పారిశుధ్య పనులు నిత్యం చేయించాలి
పన్నులు 100 శాతం వసూలు చేయించాలి
సిరిసిల్ల మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి కలెక్టర్
రాజన్న సిరిసిల్ల, మార్చి 31 (విజయక్రాంతి): సిరిసిల్ల నూతన మున్సిపల్ కౌన్సిల్ ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. సిరిసిల్ల మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో మంగళవారం నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్ర వాల్ హాజరై మాట్లాడారు. అందరి సహకారంతో ఇటీవల ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేశామని, నూతన సభ్యులందరికీ అభినందనలు తెలియజేసారు.
బడ్జెట్ మీటింగ్ చాలా కీలకమని, రెవెన్యూ వ్యయంలో భా గంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతా లు,కరెంట్ బిల్లులు,రుణాల చెల్లింపు, పారిశుధ్య పనులకు చెల్లింపులు, ఇతర ఖర్చులు ఉంటాయని, తప్పనిసరిగా పది శాతం గ్రీన్ బడ్జెట్ ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. మున్సిపల్ కు రావాల్సిన పన్నులు వంద శాతం వసూలు చేయడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తే 15వ ఆర్ధిక సంఘం నిధులు మంజూరు అవుతాయని వెల్లడించారు. మున్సిపల్ వార్డ్ సభ్యులు తమ పరిధిలో ఇంటి, నీటి పన్ను, ట్రేడ్ లైసె న్స్ ఫీజులు వసూలు చేసేందుకు సహకరించాలని, అన్ని షాప్ లు లైసెన్స్ తీసుకునేలా చూడాలని సూచించారు.
మున్సిపాలిటీకి చెందిన ఖాళీగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ గదు లు అద్దెకు ఇచ్చేందుకు మరోసారి టెండర్లు పిలువాలని ఆదేశించారు.ప్రతి రోజు పారిశుధ్య పనులు పక్కాగా చేయించాలని, తడి, పొడి చెత్త వేరువేరుగా ఇచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. పార్క్ లు,వైకుంఠధామాలు, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ ప క్కాగా ఉండాలని స్పష్టం చేశారు. కొత్త చెరువులో మరమ్మత్తు పనులు వేగంగా చేయిం చాలని, ప్రజలు, పిల్లలు వచ్చేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
డీఆర్ సీసీ కేంద్రం పక్కా గా నిర్వహిం చాలని, ఏబీసీ కేంద్రం వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. సిరి సిల్ల ఖ్యాతి చాటేలా రగుడు జంక్షన్ అభివృద్దికి శ్రీకారం చుట్టామని, త్వరలోనే వినియో గంలోకి రానున్నదని వెల్లడించారు. అమృత్ పథకం కింద తాగునీటి సమస్యకు పరిష్కా రం రానున్నదని వివరించారు. తాగునీటి స మస్య రాకుండా వార్డు సభ్యులు,అధికారులు చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు.స మావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ దార్ల సందీప్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, తహసీల్దార్ మహే ష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.




