13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

చనిపోయిన మున్సిపల్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి

01-04-2026 12:00 AM

మహబూబాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): మహబూబాబాద్ మున్సిపాలిటీ లో కార్మికులు పనిచేస్తూ ఈ మధ్యకాలంలో చనిపోయినవారి కుటుంబలను ఆదుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చైర్ పర్సన్, కమిషనర్లకు వినతిపత్రం అందజేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మ రకుంట్ల నాగన్న మాట్లాడుతూ గతంలో కార్మికులు చనిపోతే వెంటనే వారి కుటుంబంలో ఒక్కరికిని పనిలో పెట్టుకుండేవారని, గత సంవత్సర కాలం నుండి చనిపోయిన వారి కుటుంబాలకు పనిలో పెట్టుకోకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల అం డగా ఉంటుందని భావించామని, అయితే అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చనిపోయిన వారి కుటుంబాల్లో పని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్ప టికైనా తక్షణమే మరణించిన కార్మికుల కు టుంబాల సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, లేనియెడల మున్సిపాలిటీ కార్మికుల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు గుర్రాల పుష్పరాజ్, నగేష్, పుచ్చకాయలు ఎల్లయ్య, ఆవుల వీరన్న, ఇమ్మడి పద్మ, తప్పట శ్రీకాంత్, జానీ, మంజుల పాల్గొన్నారు.