13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

భద్రకాళి ఆలయానికి నూతన ధ్వజస్తంభం

01-04-2026 12:00 AM

మహబూబాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): వరంగల్ నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవాలయానికి నూతన ధ్వజస్తంభం ఏర్పాటు చేయాలని పశ్చిమ ఎమ్మె ల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాలు మేరకు వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్, ఆల య ఈవో రామాల సునీత అనుమతితో భద్రాద్రి జిల్లా పాల్వంచ దగ్గర గల వెంకటాపురం అడవిలో 50 అడుగుల ధ్వజస్తంభం కోసం వృక్షాన్ని పరిశీలించారు.

పాల్వంచ ఫారెస్ట్ రేంజ్ జోన్లో పాల్వంచ డిఎఫ్‌ఓ ఆదేశాల మేరకు ఫారెస్ట్ రేంజర్ అధికారి తుల్జా నేతృత్వంలో సుమారుగా 50 అడుగుల ఎ త్తుతో, తెలంగాణ ప్రాంతంలో అత్యంత అరుదుగా దొరికే నార వేప కర్రతో భద్రకాళి దే వాలయానికి ధ్వజస్తంభం ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో భద్రకాళి వ్యవస్థా పక అర్చకులు భద్రకాళి శేషు, భద్రకాళి ట్రస్ట్ బోర్డ్ సభ్యులు కుమార్ రెడ్డి, మోత్కూరి మ యూరి రామేశ్వర్, పాలడుగుల ఆంజనేయు లు, జరతి వెంకటేశ్వర్లు, ఓరుగంటి పూర్ణ పా ల్గొని ఎంపిక చేశారు. నూతన ధ్వజస్తంభం కోసం ఎంపిక చేసిన నార వేప చెట్టు పక్షం రోజుల్లో దేవాలయానికి చేరేలా చర్యలు తీసుకున్నారు.