calender_icon.png 5 October, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారు వర్ణంలో కాంతులీనిన ఆకాశం

04-10-2025 07:11:33 PM

వలిగొండ (విజయక్రాంతి): శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశంలో సూర్యుడు మబ్బుల మాటు నుండి బంగారు వర్ణంలో కాంతులీనుతూ కనిపించాడు. ఒక్కసారిగా ఆకాశంలో బంగారు వర్ణంతో వెలుతురు జిగేలుమనడంతో జనం ఆకాశంలో ఏదో మార్పు జరిగిందని తమ దృష్టిని ఆకాశం వైపు మరల్చారు. ఆకాశంలో బంగారు వర్ణం వెలుతురు కనిపిస్తుండడంతో ఆ అద్భుత దృశ్యాన్ని పలువురు తమ చరవాణిలలో బంధించారు. ఈ దృశ్యం ఒక నిమిషం పాటే కనిపించి మాయం రావడంతో పలువురు చూడలేదని వాపోయారు. అయితే చరవాణిలో బంధించిన వారు బంగారు వర్ణం ఆకాశం దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఎంతోమంది ఆసక్తిగా వీక్షించారు.