calender_icon.png 5 October, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా దుర్గామాత ఉత్సవాలు

04-10-2025 07:09:17 PM

తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం  బ్రాహ్మణపల్లి గ్రామంలో దుర్గామాత ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గామాత మాలలు ధరించిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గామాత 11 అవతారాలలో దర్శనమిచ్చి ఆనంద ఉత్సవాల్లో ముంచారు. దీపారాధన కార్యక్రమంలో చిన్నారి మితున దుర్గామాత వేషధారణలో అమ్మవారి రూపంలో దర్శనమిచ్చి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.