04-10-2025 07:14:31 PM
స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ నేత కంది నేతృత్వంలో సన్నాహక సమావేశం..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక జడ్పీటీసీ, యంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుదని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆయా మండలాల ముఖ్యనాయకులు కార్యకర్తలతో విడివిడిగా సమావేశమయ్యారు. బేల, భోరజ్, జైనథ్ మండల నాయకులతో భేటీలో పలు అంశాలపై చర్చించారు. పోటీకి సిద్దంగా ఉండే ఆశావహులు వారికి ఆయా ప్రాంతాలలో ఉన్న బలాబలాలపై సమీక్ష జరిపారు.
జడ్పీటీసీ, యంపీటీసీలలో ప్రతీ స్థానం నుండి కొందరి ఆశావహుల పేర్లు పరిశీలనలోకి తీసుకుని అధిష్టానం సూచనలతో తుది జాబితా ఖరారు చేస్తామన్నారు. గెలిచే సత్తా ఉన్న అభ్యర్ధులకు తప్పకుండా తుదిజాబితాలో చోటు దక్కుందన్నారు. ఎవరికి టికెట్ లభించినా అంతా కలిసి స్థానిక ఎన్నికల్లో గెలుపేలక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. ఆ కార్యక్రమంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బేల, జైనథ్, భోరజ్ మండలాలలకు చెందిన ముఖ్యనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.